: ‘కుటుంబ సమగ్ర సర్వే’కి ఇలా సిద్ధం కండి
తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ‘కుటుంబ సమగ్ర సర్వే’పై ప్రజలకు ఎన్నో అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. ఈ నెల 19న ఇళ్లకు వచ్చే సర్వే సిబ్బందికి ఎలాంటి ఆధారాలు చూపించాలన్న అంశంపై ఇంతవరకూ స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు ఓ జాబితాను రూపొందించి తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో రంగుల కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. రెండు రోజుల ముందు నుంచే ఎన్యుమరేటర్లు ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవసరమైన సమాచారం అందజేస్తారు. వారు వెళ్లిన ఇళ్లకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేకంగా తయారుచేసిన స్టిక్కర్ అంటిస్తారు. స్టిక్కర్‌పై సర్వేకు ముందు 17, 18 తేదీల్లో.. సర్వే రోజున 19న ఎన్యుమరేటర్లు వచ్చి సర్వే పూర్తి చేస్తారు. ఏవైనా అనుమానాలు ఉంటే ఎన్యూమరేటర్ ఫోన్ నంబరు వారంటించే స్టిక్కర్ పై ఉంటుంది దానికి ఫోన్ చేయాలని సూచించారు. 17న ఎన్యుమరేటర్ ఇంటికి రాకుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్ నంబరు 040-21111111కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. దానిని పరిశీలించి ఉన్నతాధికారులు తరువాత తగు చర్యలు తీసుకుంటారు. గ్యాస్ కనెక్షన్, పాస్‌పోర్టు, ఇతర సదుపాయాలు కావాలనుకునేవారు కుటుంబ వివరాలు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆస్తిపన్ను, విద్యుత్, నల్లా కనెక్షన్లకు సంబంధించిన బిల్లు రసీదులు, కుల, వికలాంగ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్‌లు అందుబాటులో ఉంచుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.