: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి: ఏపీ మంత్రి పల్లె
కర్నూలులో రేపు (శుక్రవారం) జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుతున్నామని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, సీడ్ క్యాపిటల్ అభివృద్ధిపై సీఎం చర్చించారని ఆయన అన్నారు. కర్నూలు అభివృద్ధికి చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి చెప్పారు.