: మరణించలేదు... తాను బతికే ఉన్నానంటున్న గుజరాతీ నటుడు
మరణించలేదు మహా ప్రభో, బతికే ఉన్నానంటున్నాడీ గుజరాతీ నటుడు, బీజేపీ మాజీ ఎమ్మెల్యే నరేశ్ కనోడియా. సోషల్ మీడియాలో కనోడియా మరణించారంటూ సోమవారం రాత్రి వార్తలు రావడంతో అక్కడి న్యూస్ ఛానళ్లు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి. దీంతో ఈ పుకార్లను నమ్మిన చాలా మంది కనోడియాకు ఫోన్ చేసి వాకబు చేయడం ప్రారంభించారు. తాను బతికే ఉన్నానంటూ ఆయన గుజరాత్ లోని గాంధీనగర్ పోలీసులను ఆశ్రయించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు సోషల్ మీడియాలోని ఈ వార్తలతో ఆందోళనకు గురై, తనకు ఫోన్లు చేస్తున్నారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.