: సమగ్ర సర్వేలో పాల్గొనాలా, వద్దా? అన్నది మీ ఇష్టమే: హైకోర్టు


తెలంగాణ ప్రభుత్వం ప్రతిఒక్కరూ పాల్గొనాల్సిందేనని ఆదేశించిన సమగ్ర సర్వేపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. సర్వే ఐచ్ఛికమన్న తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ వ్యాఖ్యలను హైకోర్టు రికార్డు చేసింది. సర్వేలో పాల్గోవాలా, వద్దా? అనేది ప్రజల ఇష్టమని హైకోర్టు స్పష్టం చేసింది. సర్వే ఐచ్ఛికమన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను హైకోర్టు అంగీకరించింది. ప్రజలను వ్యక్తిగత వివరాలు అడిగి ఇబ్బంది పెట్టవద్దని హైకోర్టు ఆదేశించింది. బ్యాంకు, తపాల ఖాతాలు, భీమా వివరాలు, మొబైల్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలు అడగకూడదని హైకోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News