: అంపైర్ సహకారంతోనే టీమిండియాను చుట్టేశా: అలీ


ఆవగింజంత అదృష్టం ఉంటే చాలు, ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవచ్చని నిరూపించాడు ఇంగ్లండ్ పార్ట్ టైమ్ స్పిన్నర్ మొయిన్ అలీ. ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా నడ్డివిరిచి ఒంటి చేత్తో రెండు విజయాలు అందించాడు. అయితే ఈ విజయంలో తనకంటే అంపైర్ కుమార ధర్మసేన పాత్ర ఎక్కువగా ఉందని వినమ్రంగా చెబుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఎక్కువగా పరుగులిచ్చిన అలీ గాడిన పడడం వెనుక ధర్మసేన ఉన్నాడు. పరుగులిచ్చేయడంతో బంతుల వేగం మందగించింది. దీంతో బెల్ తొందరగా బంతులేయాలని సూచించాడు. దీంతో ఏం చేయాలో అర్థంకాని తాను శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్, ప్రస్తుత అంపైర్ కుమార ధర్మసేనను సలహా అడిగానని అలీ తెలిపాడు. క్రీజులో బ్యాట్స్ మన్ ను, పిచ్ ను అత్యంత దగ్గరగా పరిశీలించిన ధర్మసేన అలీకి చిట్కా చెప్పాడు. ఫ్లాట్ బౌలింగ్ చేయడం మానేసి స్ట్రెయిట్ గా, ఫాస్ట్ గా బంతులేయమని ధర్మసేన చెప్పాడు. అంతే అతని చిట్కా పాటించిన అలీ, విజ్రుంభించి టీమిండియాను చుట్టేశాడు. దీంతో ధర్మసేనుకు ధన్యవాదాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News