: మానవత్వం బతికే ఉంది... అందుకు వీళ్ళే నిదర్శనం!


వరంగల్ జిల్లాకు చెందిన స్వప్న అనే విద్యార్థిని ఇటీవలే తండ్రిని కోల్పోయి, చివరికి కూలి పనులకు వెళుతోందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఎందరినో కదిలించింది. స్వప్నపై కథనం చూసి చాలామంది చలించిపోయారు. దాదాపు ఏడువందల మంది దాకా ఆర్ధికసాయం అందించారట. తమకు చెక్కులు పంపిన వారెవరో కూడా ఈమెకు తెలియదు... కానీ, మానవత్వం ఇంకా మిగిలే ఉందన్న విషయం మాత్రం నిరూపితమైంది. దీనిపై స్వప్న స్పందిస్తూ... సాయపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. వారి ముఖాలు ఎలా ఉంటాయో కూడా తమకు తెలియదని పేర్కొంది. వారి ఆర్ధిక సాయం ఆసరాతో బాగా చదువుకుంటామని, తాము కూడా పేదలకు తోడ్పాటునందిస్తామని ఆమె వెల్లడించింది. ఆమె తండ్రి భిక్షపతి రైతు కాగా, సాగులో నష్టాలకు తోడు అప్పులు ఆయనను బలవన్మరణం దిశగా నడిపించాయి. దీంతో, కుటుంబ పోషణ భారం స్వప్నపై పడింది. తల్లి గుండెజబ్బుతో బాధపడుతుండగా, తోబుట్టువులిద్దరూ చిన్నవాళ్ళు. కాలేజికి సెలవు వస్తే స్వప్న కేరాఫ్ అడ్రెస్ పొలమే. చేతులు బొబ్బలు ఎక్కేలా పనిచేసి తీసుకువచ్చే ఆ నాలుగు రూకలే వారి కుటుంబానికి ఆధారం. ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియాలో ఆమెపై కథనం వెలువడింది.

  • Loading...

More Telugu News