: సమగ్ర సర్వే తప్పనిసరి కాదు: హైకోర్టుకు తెలిపిన అడ్వొకేట్ జనరల్
తెలంగాణలో నిర్వహించనున్న సమగ్ర సర్వే తప్పనిసరి కాదని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. తెలంగాణలో సమగ్ర సర్వేపై విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ పలు విషయాలను తెలిపారు. స్వచ్ఛందంగానే సమగ్ర సర్వే నిర్వహిస్తామని కోర్టుకు తెలిపారు. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో చొరబడేందుకు తాము సర్వే నిర్వహించడం లేదని అడ్వొకేట్ జనరల్ న్యాయస్థానానికి విన్నవించారు. ప్రజా సంక్షేమం కోసమే సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. దీంతో సమగ్ర సర్వే తప్పనిసరి అంటూ ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలు నిర్వీర్యమయ్యాయి.