: విశాఖ వీధుల్లో భారీ త్రివర్ణ పతాక ప్రదర్శన
భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ వీధుల్లో భారీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించారు. సుమారు కిలోమీటరు పొడవున్న ఈ జాతీయ జెండాను పట్టుకుని వైజాగ్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు నగర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ భారీ త్రివర్ణ పతాకాన్ని విశాఖ వాసులు ఆసక్తిగా తిలకించారు. బుధవారం నాడు చెన్నైలోనూ 200 అడుగులున్న భారీ జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శన నిర్వహించిన సంగతి తెలిసిందే.