: నాసా తీసిన ఆ ఫోటో గ్రహాంతరవాసిదేనా?...చంద్రుడిపై ఏలియన్ ఉన్నాడా?


గ్రహాంతరవాసులు అత్యంత శక్తిమంతులుగా ఉండడం, సోలార్ ఎనర్జీతో వారు శక్తిని సమకూర్చుకోవడం, మనుషుల్ని చూసి యుద్ధాలకు దిగడం సినిమాల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా అమెరికా స్పేస్ సంస్థ నాసా తాజాగా ఓ ఛాయాచిత్రాన్ని విడుదల చేసింది. దానిని పరిశీలిస్తే ఓ మనిషి నీడ కనిపిస్తుంది. చంద్రుడిపై మనుషులెవరూ లేరన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో చంద్రుడిపై ఆ నీడ ఎలా వచ్చిందన్నదే ప్రశ్న. గూగుల్ ఎర్త్ లాగే గూగుల్ మూన్ కూడా సిద్ధం చేయాలని తలపెట్టడంతో దానికోసమే నాసా ఈ ఫొటోలు తీసినట్లు సమాచారం. ఈ ఫోటోను నాసా ప్రయోగించిన ఉపగ్రహంలోని కెమెరా తీసింది. మరి మనిషి నీడ ఎలా కనిపించింది? అంటే గ్రహాంతర వాసులు ఉన్నట్లేనా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలను తొలిచేస్తోంది. దీనికి తోడు ఏలియన్ కు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను, నాసా ఫొటోను చూసినవాళ్లంతా ఇది గ్రహాంతర వాసులు (ఏలియన్) ఉన్నారని, నాసా విడుదల చేసిన ఫోటో ఏలియన్ దేనని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే అది ఏలియన్ ఫోటోయేనని నాసా నిర్ధారించలేదు. వావ్ఫర్రీల్ అనే యూజర్ పేరుతో పోస్టయిన ఈ వీడియోను నెల రోజుల్లో 20 లక్షల మంది చూడడం విశేషం.

  • Loading...

More Telugu News