: క్రికెటర్ కాకపోయి ఉంటే పొలంబాట పట్టేవాడట!
టీమిండియాలో స్థానం కోల్పోయిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఆర్పీఎఫ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, క్రికెటర్ ను కాకపోయి ఉంటే పొలంబాట పట్టేవాణ్ణని తెలిపాడు. హర్యానాలో వీరూ కుటుంబానికి కొంత వ్యవసాయ భూమి ఉందట. తండ్రి వ్యవసాయదారుడు కావడంతో తాను ఆయన అడుగుజాడల్లోనే నడిచేవాణ్ణని పేర్కొన్నాడు. ప్రస్తుతం వీరూ చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ కోసం సొంత అకాడమీలో ముమ్మర సాధన చేస్తున్నాడు. వీరూ ప్రాతినిధ్యం వహిస్తున్న కింగ్స్ లెవన్ పంజాబ్ జట్టు చాంపియన్స్ లీగ్ కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో రాణించడం ద్వారా టీమిండియాలోకి పునరాగమనం చేస్తానని ధీమా వ్యక్తం చేశాడీ విధ్వంసక బ్యాట్స్ మన్.