: బాబోయ్... ఈసారి విడుదల చేసే 'పీకే' పోస్టర్లో టేప్ రికార్డర్ కూడా ఉండదట!


అమీర్ ఖాన్ తాజా చిత్రం 'పీకే' పోస్టర్ల స్థాయిలోనే దుమ్మురేపుతోంది! హీరో అమీర్ ఖాన్ ఒంటిపై దుస్తుల్లేకుండా, కేవలం ఓ టేప్ రికార్డర్ ను కటిభాగానికి అడ్డుపెట్టుకున్నట్టుగా ఉన్న పోస్టర్లు ఇప్పటికే ఎంతో సంచలనం సృష్టించాయి. వాటిపై దేశవ్యాప్తంగా దుమారం రేగడం, దానిపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం తిరస్కరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీకే యూనిట్ మరింత రెచ్చిపోయింది. త్వరలోనే రెండో విడత పోస్టర్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మొదటి అంచె పోస్టర్లలో అడ్డుగా టేప్ రికార్డరయినా ఉంటుంది, ఈసారి విడుదల చేసే పోస్టర్లలో అది కూడా ఉండదట. అమీర్ ఖాన్ స్వయంగా చెప్పాడీ విషయాన్ని. ఆగస్టు 20న రానున్నాయట ఈ కొత్త పోస్టర్లు. 'మై మరాఠి' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ ఈ విషయాలు పంచుకున్నాడు. 'పీకే' చిత్రంలో తాను భోజ్ పురి భాష మాట్లాడే వ్యక్తిగా కనిపిస్తానని తెలిపాడు. ఆ యాస సరిగా పలికేందుకు రెండేళ్ళ పాటు శిక్షణ తీసుకున్నానని వెల్లడించాడీ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్.

  • Loading...

More Telugu News