: పూలన్ దేవి హంతకునికి జీవిత ఖైదు
సమాజ్ వాదీ ఎంపీ పూలన్ దేవి హత్య కేసులో దోషి షేర్ సింగ్ రానాకు ఢిల్లీలోని పాటియాల కోర్టు జీవితకాల శిక్ష విధించింది. దాంతో పాటు రాణాకు లక్ష రూపాయల జరిమానా విధించింది. కొన్ని రోజుల కిందట ఈ కేసులో రానాను న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో పదిమందిని నిర్ధోషులుగా తేల్చింది.