: మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన అక్కాచెల్లెళ్లకు త్వరలో ఉరిశిక్ష
మహారాష్ట్ర కొల్హాపూర్ కు చెందిన రేణుకా షిండే, సీమా గవిట్ అనే అక్కాచెల్లెళ్లకు త్వరలో ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే వారి క్షమాభిక్ష పిటిషన్ లను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరిని ఏ సమయంలోనైనా ఉరితీసే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. పదమూడు మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన అక్కాచెల్లెళ్లు వారిలో తొమ్మిది మందిని 1990, 96లో దారుణంగా హత్య చేశారు. 2001లో ఈ కేసులో వారిద్దరికీ ఉరిశిక్ష పడింది. కాగా, ఇద్దరు మహిళలను ఉరి తీయడం భారతదేశంలో ఇదే తొలిసారి కావచ్చని అంటున్నారు.