: మొదటి ప్రపంచ యుద్ధంలో భారత సైనికుల త్యాగాన్ని ప్రస్తుతించిన ఐరాస చీఫ్


మొదటి ప్రపంచ యుద్ధం సందర్భంగా భారత సైనికులు ఎందరో ప్రాణత్యాగం చేశారని ఐక్యరాజ్యసమితి చీఫ్ బాన్ కీ మూన్ ప్రస్తుతించారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ రాసిన ఛాయాచిత్ర సహిత పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బ్రిటీష్ వారి హయాంలో భారత్ నుంచి లక్ష మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారని, వారిలో అరవై వేలమంది అసువులు బాశారని బాన్ కీ మూన్ గుర్తు చేశారు. అయితే, చరిత్ర వీరి త్యాగాలను విస్మరించడం విచారకరమని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News