: టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకబోతోన్న మరో కళాత్మక బ్యాట్స్ మన్
మరో కళాత్మక బ్యాట్స్ మన్ కెరీర్ కు తెరపడపోతోంది. స్టైలిష్ బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న లంక బ్యాటింగ్ దిగ్గజం మహేల జయవర్థనే తన ఆఖరి టెస్ట్ కు సిద్ధమయ్యాడు. గురువారం శ్రీలంక-పాకిస్థాన్ ల మధ్య జరిగే రెండో టెస్ట్ మ్యాచే మహేలకు చివరి మ్యాచ్. ఇప్పటికే తొలి టెస్ట్ నెగ్గి మంచి ఊపు మీదున్న శ్రీలంక... రెండో టెస్ట్ కూడా గెలిచి మహేలకు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని భావిస్తోంది. 17 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్ కు వెన్నెముకగా నిలిచిన మహేల... సహచరుడు సంగక్కరతో కలిసి తన దేశానికి ఎన్నో అద్భుత విజయాలను అందించాడు.