: అమీర్ ఖాన్ పై కేసు పెట్టాల్సిందే: బీఎస్పీ ఎంపీ


'పీకే' పోస్టర్లలో నగ్నంగా దర్శనమిచ్చిన బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ పై కేసు నమోదు చేయాల్సిందేనని బహుజన సమాజ్ పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా డిమాండ్ చేశారు. సమాజం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అమీర్ ఖాన్, తనను తాను పెద్ద సంఘ సంస్కర్తగా ఆవిష్కరించుకుంటారని మిశ్రా వ్యాఖ్యానించారు. అలాంటి అమీర్ ఖాన్ చట్టాన్ని ఉల్లంఘించే చర్యలకు ఎలా పాల్పడతారని ఆయన ప్రశ్నించారు. నగ్నత్వాన్ని బహిరంగంగా ప్రదర్శించడాన్ని భారత చట్టం అనుమతించదని, మరి పోస్టర్లలో నగ్నంగా కనిపించిన అమీర్, చట్టాన్ని ఉల్లంఘించినట్లే కదా అంటూ మిశ్రా వాదించారు.

  • Loading...

More Telugu News