: సమగ్ర కుటుంబ సర్వేలో మాకు'ప్రత్యేక కాలమ్' కేటాయించండి: హిజ్రాలు
సమగ్ర కుటుంబ సర్వేలో తమకు 'ప్రత్యేక కాలమ్' కేటాయించాలని హిజ్రాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఆగస్ట్ 19న నిర్వహిస్తున్న సర్వేలో అన్ని వర్గాల ప్రజల వివరాలు సేకరిస్తున్నందున... హిజ్రాలైన తమ వివరాలు కూడా సర్వేలో తీసుకోవాలని వారు ప్రభుత్వానికి అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నారు. సర్వే పత్రంలో తమకు'ప్రత్యేక కాలమ్' కేటాయించి... తమ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసుకోవాలని వారు ప్రభుత్వానికి సూచించారు.