: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎప్పుడిస్తారు?: జైరాం రమేష్


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంపై కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ ఎన్డీయే సర్కార్ ను నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం లేనట్టు కనబడుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కేంద్రప్రభుత్వానికి జైరాం రమేష్ ఓ ఘాటు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా విషయమై ఇటీవల ప్రణాళిక, పథకాల అమలు శాఖ మంత్రి రావుఇందర్ జిత్ సింగ్ జైరాంరమేష్ కు లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై ప్రణాళిక సంఘంలో ఓ ప్రత్యేక విభాగం పనిచేస్తుందని ఈ లేఖలో ఆయన తెలియజేశారు. ఈ లేఖపై ఏమాత్రం సంతృప్తి చెందని జైరాం రమేష్ కేంద్రానికి ఘాటు లేఖ రాశారు. ప్రణాళిక సంఘం నత్తనడకన పనులు చేస్తుంటే ఈ వ్యవహారం ఎప్పటికి తేలుతుందని ఆయన నిలదీశారు. మన్మోహన్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ఎన్డీయే సర్కార్ కు ఉందని ఆయన గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News