: పంద్రాగస్టున గోల్కొండ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
ఆగస్టు 15వ తేదీన గోల్కొండ కోట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు అదనపు కమిషనర్ జితేందర్ ప్రకటించారు. వీఐపీల వాహనాలకు ఫతే దర్వాజ, బంజారా దర్వాజ, బడా బజార్ లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే సందర్శకులకు పార్కింగ్ ప్రాంతాల నుంచి గోల్కొండ వరకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.