: సాధారణ పరిపాలనపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ (బుధవారం) సాయంత్రం రాష్ట్రంలోని సాధారణ పరిపాలనపై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... గత పదేళ్లలో పాలన భ్రష్టు పట్టిందని, ప్రాథమిక విద్యా వ్యవస్థ కుప్పకూలిపోయిందని అన్నారు. దేశంలో ప్రాధమిక విద్యలో ఆంధ్రప్రదేశ్ 31వ స్థానానికి పడిపోయిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఇష్టానుసారం దోచుకున్నారని అన్నారు. గత పదేళ్లలో ముడి ఇనుమును లూటీ చేసి అమ్మేశారని ఆయన చెప్పారు. సాక్షాత్తు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోలేదని ఆయన చెప్పారు. సుపరిపాలన అందాలంటే ప్రజల సహకారం ఉండాలని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్ అసమర్థత వల్లే ధరలు పెరిగాయని ఆయన అన్నారు. విధానాలేమీ లేకుండానే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను చేపట్టారని ఆయన విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేసిందన్నారు. సెజ్ ల పేరిట సంస్థలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించలేదని చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News