: జెట్ విమానం కాక్ పిట్ విండోలో పగుళ్లు... అత్యవసర ల్యాండింగ్
థాయ్ ఎయిర్ వేస్ కు చెందిన జెట్ విమానం సిడ్నీ నుంచి బ్యాంకాక్ వెళ్తూ ఇండోనేషియాలోని బాలి ద్వీపకల్పంలో అత్యవసరంగా దిగింది. విమానం కాక్ పిట్ విండోలో పగుళ్లు కనబడడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని దగ్గర్లో ఉన్న బాలిలో దించారు. సిడ్నీ నుంచి 6 గంటలు ప్రయాణం చేసిన ఈ బోయింగ్ 747 విమానంలో 273 మంది ప్రయాణికులు, 21 మంది సిబ్బంది ఉన్నారు. అక్కడ విండో గ్లాస్ మార్చడంతో విమానం ప్రయాణాన్ని కొనసాగించింది.