: ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బెస్తవారిపేట మండలంలోని తాటిచర్లమోటు దగ్గర లారీ, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.