: గవర్నర్ అధికారాలపై స్పష్టత వచ్చాకే మా అభిప్రాయం చెబుతాం: జానారెడ్డి
హైదరాబాదులో గవర్నర్ అధికారాలపై స్పష్టత వచ్చిన తరువాత తమ అభిప్రాయం చెబుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మగౌరవానికి, అభివృద్ధికి ఆటంకం కలుగకుండా కేంద్రం చూడాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీపై ఉత్తర్వులివ్వడం అభినందనీయమని ఆయన తెలిపారు. నెల రోజుల్లో రైతురుణాలు చెల్లించాలని ఆయన సూచించారు. వ్యవసాయానికి 7 గంటల నిరంతరాయ విద్యుత్ అందజేయాలని, లేని పక్షంలో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి వెళ్లిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హామీల అమలు కార్యాచరణ ప్రకటించాలని ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వానికి సూచించారు.