: ఇమ్రాన్ ఖాన్ ను నడిపిస్తోంది ఐఎస్ఐ మాజీ చీఫా?
మాజీ క్రికెటర్, పాకిస్థాన్ తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను ఐఎస్ఐ నడిపిస్తోందని పాక్ సమాచార శాఖ మంత్రి తెలిపారు. ఇస్లామాబాదులో ఆయన మాట్లాడుతూ, నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇమ్రాన్ ఖాన్, ఐఎస్ఐ మాజీ అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షుజా పాషా కుట్రపన్నారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ కు పాషా స్ట్రాటజిక్ అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాజధానిలో ఉద్రిక్తతలు రేపేందుకు లాహార్ నుంచి ఇస్లామాబాదుకు ర్యాలీ చేపట్టనున్నారని ఆయన తెలిపారు. 60 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.