: భారత సంతతి వారిని వరించిన రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు
న్యూయార్క్ నివాసులైన భారత సంతతికి చెందిన ఇద్దరు విద్యావేత్తలను గణిత శాస్త్రానికి సంబంధించిన రెండు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు వరించాయి. నోబెల్ ప్రైజ్ ఆఫ్ మేధమేటిక్స్ గా పేర్కొనే ఫీల్డ్స్ మెడల్ ను మంజుల్ భార్గవ గెలుచుకున్నారు. రోల్ఫ్ నెవాన్ లిన్నా బహుమతి సుభాష్ ఖోట్ కు లభించింది. సియోల్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఆఫ్ మేథమెటీషియన్స్ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ మేథమెటికల్ యూనియన్ (ఐఎంయూ) ఈ బహుమతులను అందించింది. నాలుగేళ్లకోసారి ఇచ్చే ఫీల్డ్స్ మెడల్ గెలుచుకున్న మంజుల్ భార్గవ ప్రిన్స్ టన్ వర్శిటీలో ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు ఈ బహుమతిని అందుకున్నారు. న్యూయార్క్ వర్శిటీకి చెందిన కౌరంట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ లో సుభాష్ ఖోట్ ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు.