: పెళ్లి కూతురైన చెస్ క్వీన్
చెస్ క్వీన్ కోనేరు హంపి పెళ్లి కూతురైంది. నేటి అర్థరాత్రి ప్రముఖ పారిశ్రామికవేత్త దాసరి రామకృష్ణ కుమారుడు అన్వేష్ తో హంపి పెళ్లి జరగనుంది. దీంతో ఈ ఉదయం హంపిని సంప్రదాయబద్ధంగా పెళ్లికూతురిని చేశారు. విజయవాడలోని మొగల్రాజపురంలోని హంపి నివాసంలో ఈ వేడుక జరిగింది. పెళ్లికి తరలివచ్చిన బంధుమిత్రులతో హంపి నివాసం కళకళలాడుతోంది. విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్, పలువురు స్థానిక నాయకులు ఆమె నివాసానికి వెళ్లి ఆశీర్వదించారు.