: ఆగస్ట్ 15 వేడుకలకు కోటి 21లక్షల 98వేల రూపాయలను విడుదల చేసిన ఏపీ సర్కార్
ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో, రాష్ట్ర వ్యాప్తంగా వేడుకల నిర్వహణకు కోటి 21 లక్షల 98 వేల రూపాయల భారీ మొత్తాన్ని ఏపీ సర్కార్ విడుదల చేసింది. కర్నూలు కోటలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు జెండా ను ఎగురవేస్తారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలను 'సన్‌రైజ్ ఏపీ' పేరుతో నిర్వహించనున్నారు. అలాగే, జిల్లాల వారీగా ఏ మంత్రి ఎక్కడ జెండా ఎగురవేయాలనే దానిపై కూడా ఏపీ ప్రభుత్వం విధివిధాలను ఖరారు చేసింది.