: రండి, మా ఐడియాలు కాపీ కొట్టుకోండి: బీజేపీకి సోనియా చురక


అధికార బీజేపీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చురకలంటించారు. దేశానికి బీజేపీ కొత్తగా అందించడానికి ఏమీ లేదని, వారిక తమ ఐడియాలు చౌర్యం చేసుకోవచ్చని ఎత్తిపొడిచారు. ఈ మేరకు వారిని ఆహ్వానిస్తున్నామని వ్యంగ్యోక్తి విసిరారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన పథకాలన్నీ యూపీఏ హయాంలోనివేనని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

  • Loading...

More Telugu News