: పద్మ అవార్డులకు ధోనీ, కోహ్లీ పేర్లు సిఫార్సు


భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీల పేర్లను పద్మ అవార్డులకు సిఫార్సు చేస్తూ బీసీసీఐ క్రీడా మంత్రిత్వ శాఖకు లేఖ పంపింది. ఇటీవల ఇంగ్లండుతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో కష్టపడి గెలిచింది. ఈ నేపథ్యంలో వారిద్దరి పేర్లను పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలకు రికమండ్ చేస్తూ పంపినట్లు సమాచారం. ఇక టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ పేరును కూడా పద్మశ్రీ అవార్డుకు బీసీసీఐ ప్రతిపాదించినట్లు మీడియా సమాచారం.

  • Loading...

More Telugu News