: కృష్ణాజిల్లాలో పార్టీ నేత కుటుంబానికి జగన్ పరామర్శ


కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన పార్టీ నేత కృష్ణారావు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ఆ గ్రామానికి వెళ్లిన ఆయన, పార్టీ తరఫున వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని చెప్పారు. గ్రామంలోని కొంతమంది ప్రత్యర్థులు ఆదివారం అర్థరాత్రి ఉప సర్పంచ్ కృష్ణారావును దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News