: గుంటూరును రాజధాని చేస్తే... 'ప్రత్యేక' ఉద్యమం తప్పదు: భూమా హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ కు నూతన రాజధానిగా గుంటూరును ఎంపిక చేస్తే... రాయలసీమలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తప్పదని వైసీపీ నేత, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని ప్రజలు ఆందోళన చేస్తుంటే... చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఆ విషయాన్ని ఇసుమంత కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ సర్కార్ గుంటూరు నామస్మరణ మానుకొని... రాజధాని ఎంపిక విషయంలో రాయలసీమ ప్రజల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.