: స్థాయిని దిగజార్చొద్దు: ఎంపీలకు రాష్ట్రపతి హితవు


పార్లమెంట్ లో గది కోసం టీడీపీ, తృణమూల్ సభ్యుల మధ్య జరిగిన వాగ్వివాదం, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని బాగా ఇబ్బంది పెట్టినట్టే ఉంది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే ప్రణబ్, దీనిపై ఒకింత ఆవేశంగా స్పందించారు. ఉత్తమ పార్లమెంటేరియన్లుగా ఎంపికైన సభ్యులను సన్మానించిన సందర్భంగా ఎంపీల ముందే, కాస్త కటువుగానే స్పందించారు. ‘దయ చేసి మీలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి పని చేయొద్దు. బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రజల చేత ఎన్నుకోబడిన మనం, ఈ సభ పరువు, ప్రతిష్ట, గౌరవాలను కాపాడాల్సి ఉంది‘ అంటూ ప్రణబ్ సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత నరేంద్ర మోడీ, శిరసు వంచి పార్లమెంటు మెట్లను ముద్దాడిన వైనాన్ని గుర్తు చేసిన ప్రణబ్, సభలో సభ్యుడిని కానందున ఇంతకు మించి మరేమీ మాట్లాడలేనని కూడా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News