: అమ్మాయిలూ... క్రీడలపై ఆసక్తి పెంచుకోండి: అభిషేక్ బచ్చన్


కళాశాల అమ్మాయిలు క్రీడలపై కాస్తంత ఆసక్తిని పెంచుకోవాల్సిందేనంటున్నాడు చోటా బచ్చన్. ఇటీవలే ఇండియన్ కబడ్డీ లీగ్ లో పింక్ పాంథర్స్ జట్టును కొనుగోలు చేసిన అభిషేక్ బచ్చన్, దాని ప్రచార కార్యక్రమంలో భాగంగా బీహార్ లో పర్యటించాడు. ఈ సందర్భంగా మగధ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరై, విద్యార్థినులతో ముచ్చటించాడు. క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్న చోటా బచ్చన్ సలహాకు మంచి స్పందనే వచ్చిందట. తమ కుటుంబంపై బీహారీలు ఎప్పటికీ ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తూనే ఉన్నారని, ఈసారి వచ్చేటప్పుడు తన భార్య ఐశ్వర్యారాయ్ ను కూడా తీసుకువస్తానని విద్యార్థినులకు హామీ ఇచ్చాడట. అక్కడి నుంచి వెళ్లేముందు వారితో ఓ సెల్ఫీ తీసుకుంటానని చెప్పిన అభిషేక్, సదరు సెల్ఫీని ఐశ్వర్యకు కూడా చూపిస్తానని చెప్పి, విద్యార్థినుల్లో సంతోషం నింపాడట. సదరు సెల్ఫీని ట్విట్టర్ లోనూ పోస్ట్ చేసిన అభిషేక్, భారత్ భవిష్యత్తు మహిళల సత్తాపైనే ఆధారపడి ఉందని కూడా వ్యాఖ్యలు జోడించాడు.

  • Loading...

More Telugu News