: ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఎంసెట్ నోటిఫికేషన్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 14న 25 వేల ర్యాంకు వరకు, 16న 50 వేల ర్యాంక్ సాధించిన విద్యార్థుల వరకు సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. 17న 75 వేలు, 18వ తేదీన లక్ష వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. తెలంగాణలో 23వ తేదీ వరకు ఎంసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతుంది.