తిరుమలలోని మొదటి ఘాట్ రోడ్డులో జీపు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు.