: రేవంత్ రెడ్డి అవినీతిని బయటపెడతాం: టీఆర్ఎస్ నేత


టీడీపీ నేత రేవంత్ రెడ్డి అవినీతిని, బ్లాక్ మెయిలింగ్ సంపాదనను బయటపెడతామని టీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కిషన్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాదులో పుట్టిన కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అని ఆయన మండిపడ్డారు. కేంద్రంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి విమర్శలు చేస్తూనే ఉంటారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News