: రైల్లో మహిళను వేధించిన కానిస్టేబుల్ అరెస్ట్


రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళను వేధించిన కానిస్టేబుల్ ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోట-పాట్నా ఎక్స్ ప్రెస్ రైల్లో ఓ మహిళను ఇటవా నుంచి కాన్పూరు వస్తున్న జేపీ సోలంకి అనే కానిస్టేబుల్ రాత్రంతా వేధించాడు. దీంతో ఆమె అదే రాత్రి టీటీఈకి ఫిర్యాదు చేసింది. అతను జీఆర్పీ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన జీఆర్పీ పోలీసులు కానిస్టేబుల్ ను ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరు వద్ద అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News