: నారాయణతో విభేదాలు లేవు...పార్టీ కోసమే ఆనం సోదరులను పిలిచా: సోమిరెడ్డి
మంత్రి నారాయణతో తనకు విభేదాలు లేవని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పార్టీలోకొచ్చే కొత్త వ్యక్తులతో తనకు విభేదాలు ఉండవని అన్నారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా తనతో విభేదాలున్న ఆనం సోదరులను సైతం స్వయంగా పార్టీలోకి ఆహ్వానించానని ఆయన గుర్తు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కోసం కేసులు అనుభవించిన వారికి తగిన గుర్తింపు లభించాలన్నదే తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. పార్టీ శ్రేయస్సే తనకు ముఖ్యమని సోమిరెడ్డి తెలిపారు.