: దాణా స్కాంలో లాలూ పిటిషన్ కొట్టివేత


దాణా కుంభకోణం కేసులో జరుగుతున్న విచారణను కొట్టివేయాలని కోరుతూ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ను రాంచిలోని సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఈ స్కాంలో ఛాయ్ బసా ఖజానాలోని నిధులను లాలూ దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన ఓ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే కేసుకు సంబంధించి రెండు శిక్షలు విధించాలన్న నిబంధన లేదని, కాబట్టి తమ విన్నపాన్ని పరిశీలించాలని కూడా లాలూ న్యాయవాది ప్రభాత్ కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే, దీనిపై తాము తప్పకుండా హైకోర్టుకు వెళతామని న్యాయవాది తెలిపారు.

  • Loading...

More Telugu News