: గోడ కూలి ఏడుగురు మృతి
రాజస్థాన్ లోని బరాన్ జిల్లాలో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని కల్మంద గ్రామంలో భారీ వర్షాలు కురవడంతో ఈ గోడ కూలిందని జిల్లా అధికారులు తెలిపారు. ఆ కుటుంబం గోడ పక్కనే నివసించడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో నలుగురు బాలికలు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు.