: కొత్తపల్లి గీతపై కొత్త వివాదం... ఈసీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
వైఎస్సార్సీపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసిన వేళావిశేషం బాగున్నట్టు లేదు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫేస్ బుక్ వివాదం ముగిసిన వెంటనే మరో వివాదం ఆమెను చుట్టుముట్టింది. వైఎస్సార్సీపీ నేతలు ఆమెపై కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నారు. గీత నామినేషన్ వేసినప్పుడు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు దాఖలు చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎలక్షన్ కమీషనర్ భన్వర్ లాల్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో కొత్త వివాదంలో ఎంపీ గీత చిక్కుకున్నారు.