: పెద్దల సభలో రేఖ 'స్పెషల్ అప్పియరెన్సు'!


సెలబ్రిటీ మెంబర్లు రాజ్యసభకు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సచిన్ టెండూల్కర్, రేఖ వంటి ప్రముఖులు సభలో కనిపించడం లేదంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ సభ్యులు తీవ్రంగా నిరసించారు. ఈ నేపథ్యంలో సచిన్, రేఖ విభిన్నంగా స్పందించారు. సచిన్ సెలవు పెట్టి అధికారికంగా గైర్హాజరవగా, రేఖ మాత్రం సభలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఈ మధ్యాహ్నం 12 గంటలకు రాజ్యసభకు హాజరైన ఈ 59 ఏళ్ళ అందాలతార ఓ అరగంట మాత్రమే సభలో గడిపారు. అనంతరం వెళ్ళిపోయారు. సచిన్ చివరిసారి సభకు హాజరైంది 2013 డిసెంబర్ 13న కాగా, రేఖ ఈ ఏడాది ఫిబ్రవరి 19న హాజరయ్యారు.

  • Loading...

More Telugu News