: రుణ మాఫీపై ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రాంత రైతులకు శుభవార్త. రైతులకు లక్ష రూపాయల వరకు పంట రుణాలను మాఫీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇవాళ (మంగళవారం) ఉత్తర్వులు జారీ చేసింది. రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తామని టీఆర్ఎస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం రుణ మాఫీ చేయడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు.