: మాసాయిపేట ఘటనలో మరో ఇద్దరు చిన్నారులు డిశ్చార్జ్
మెదక్ జిల్లా మాసాయిపేట స్కూల్ బస్సు ఘటనలో గాయపడ్డ వారిలో మరో ఇద్దరు చిన్నారులు ఈరోజు (మంగళవారం) సికింద్రాబాదు యశోదా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చిన్నారులు ప్రశాంత్, శరత్ ను వైద్యులు ఇంటికి పంపారు. వీరితో ఇప్పటివరకు పదహారు మందికి పైగా చిన్నారులు డిశ్చార్జ్ అయ్యారు. కాగా, వరుణ్ గౌడ్ అనే మరో చిన్నారి ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెప్పారు.