: గోమాతలకు వృద్ధాశ్రమాలు


కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయం ఎంతో ప్రసిద్ధికెక్కింది. ఆ గోపాలుడి ఆలయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న గురువాయూర్ దేవస్వం బోర్డు తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తాము నడిపిస్తున్న గోవుల పెంపక కేంద్రాన్ని గోమాతల వృద్ధాశ్రమంగా మార్చాలని భావిస్తోంది. బోర్డు మలప్పురం జిల్లాలోని పెరింతాల్ మణ్ణ వద్ద 90 ఎకరాల విస్తీర్ణంలో గో సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 'గో హత్య మహాపాతకం' అన్న హెచ్చరిక నేపథ్యంలో హిందువులు తమ వద్ద ఉన్న ఈడుబోయిన ఆవులను ఈ కేంద్రంలో వదిలేస్తున్నారట. ప్రతి నెలా ఇక్కడ నాలుగైదు ఆవులు మృత్యువాత పడుతున్నాయని స్థానిక పశువైద్యులు చెబుతున్నారు. దీనిపై హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అక్కడి పశువులకు తగినంత గ్రాసం లభించడంలేదని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే దేవస్వం బోర్డు వృద్ధాశ్రమాల నిర్ణయం తీసుకుంది. పాలిచ్చే ఆవులను గురువాయూర్ సమీపంలోని కావీడు వద్ద ఉన్న పాడి కేంద్రానికి తరలించాలని, వయసుడిగిన గోవులను వృద్ధాశ్రమాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. వీటితో పాటు వార్ధక్యంలో ఉన్న వృషభరాజాలకు కూడా ఈ ఆశ్రమంలో స్థానం కల్పిస్తారు.

  • Loading...

More Telugu News