: నిధులు చాలా ఉన్నాయి, కానీ అవినీతి దేశాన్ని అభివృద్ధి చెందనివ్వటం లేదు: మోడీ


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వద్ద నిధులు చాలా ఉన్నాయి కానీ... దేశాన్ని అవినీతి అన్నది అభివృద్ధి చెందనివ్వటం లేదని అన్నారు. అధికార వ్యవస్థలలో పేరుకుపోయిన అవినీతి దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిందని జమ్మూకాశ్మీర్ పర్యటనలో మోడీ చెప్పారు. వ్యవస్థలో అవినీతి పట్ల ప్రజలు కూడా ఆగ్రహంగా ఉన్నారన్నారు. రాజకీయ నాయకులతో పాటు అధికారులలో కూడా అవినీతి పేరుకుపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. పాలనా వ్యవస్థలో నిజాయతీ కలిగిన అధికారులు కూడా కొంతమంది ఉన్నారని... వారికి తమ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుందని మోడీ అన్నారు. దేశంలో అవినీతి తగ్గినప్పుడే... పేదరికం నుంచి భారత్ బయటపడగలదని పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మోడీ వ్యాఖ్యానించారు. అవినీతిని తమ ప్రభుత్వం ఏమాత్రం సహించదని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News