: కెప్టెన్ ధోనీకి భద్రత కుదింపు
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఇప్పటిదాకా కల్పిస్తున్న భద్రతను తగ్గించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. వీఐపీలకు కల్పిస్తున్న భద్రతపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ధోనీకి ఎలాంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు... టీమిండియా కెప్టెన్ భద్రతను కుదించాలని సమీక్షలో నిర్ణయించినట్టు పోలీసు అధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ఇప్పటిదాకా తొమ్మిది మందితో కూడిన జెడ్ కేటగిరీ భద్రత ఉందేది. తాజా నిర్ణయంతో అతని భద్రత వై కేటగిరీకి మార్చారు. ఈ కేటగిరీలో ఏడుగురు పోలీసు సిబ్బంది భద్రతగా ఉంటారు.