: టీఎస్ పంద్రాగస్టు వేడుకలకు 5 వేల మందికి పాసులు


ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను తెలంగాణ ప్రభుత్వం గోల్కొండ కోటలో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు వీఐపీలతో పాటు 5 వేల మందికి పాసులను ఇవ్వనున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి ఈ వివరాలను తెలిపారు. గోల్కొండలో నిర్వహణ ఏర్పాట్లను ఈ రోజు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఏడాది నిర్వహిస్తున్న విధంగా ఈ సంవత్సరం పోలీసుల కవాతు, శకటాల ప్రదర్శన ఉండవని చెప్పారు.

  • Loading...

More Telugu News