: 880 అడుగులు దాటిన శ్రీశైలం జలాశయ నీటిమట్టం
కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయానికి వరదనీటి ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత ఇన్ ఫ్లో లక్షా 25 వేల 799 క్యూసెక్కులు కాగా... ఔట్ ఫ్లో 85 వేల 666 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 880.5 అడుగులకు చేరుకుంది.