: ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ముట్టడించిన ఏబీవీపీ
బీజేపీ అనుబంధ ఏబీవీపీ విద్యార్థి సంఘం హైదరాబాద్ హైదర్ గూడలో ఉన్న ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ముట్టడించింది. ఫీజు రీయింబర్స్ మెంటును వెంటనే చేయాలని ఈ సందర్భంగా విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అలసత్వంతో విద్యార్థులు అత్యంత విలువైన విద్యాసంవత్సరాన్ని కోల్పోయే అవకాశం ఉందని వారు అన్నారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషనుకు తరలించారు.